ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి మహిళ శనివారం మృతి చెందింది. ఎమ్మెల్యే ఇంట్లో బాత్‌రూమ్‌లో అపస్మారకస్థితిలో ఉండగా వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు కాలనీవాసులు తెలిపారు.
కారు ఢీకొని రైతు దుర్మరణం
తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని కొత్తపల్లి స్టేజీ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణంచెందాడు. పోలీసుల వివరాలు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గోలి చంద్రారెడ్డి(50) తన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంపై ఉదయం 7 గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. 7.40 గంటలకు తిరిగి ఇంటికి వస్తుండగా గ్రామంలోని స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుంచి కరీనంగర్‌కు వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో చంద్రారెడ్డి రోడ్డుపై పడిపోయి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా ఎల్‌ఎండీ ఎస్సై వివేక్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీనంగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ..
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్‌రోడ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని తూర్పాక తిరుపతమ్మ (40) మృతిచెందింది. పోలీసుల వివరాలు.. జగిత్యాల బుడిగజంగాల కాలనీకి చెందిన తిరుపతమ్మ శుక్రవారం రాత్రి పెరుగు కొనుగోలు చేసేందుకు కరీంనగర్ రోడ్‌లోని మిల్క్‌డెయిరీ సెంటర్‌కు వచ్చింది. పెరుగు కొనుగోలు చేసి రోడ్డు దాటుతుండగా నిజామాబాద్–1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి తిరుపతమ్మను ఢీనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి సోదరుడు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మధరావు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో జైలు..
వేములవాడఅర్బన్/వేములవాడరూరల్/బోయినపల్లి: వేములవాడరూరల్ సర్కిల్ పరిధిలోని బోయినపల్లి, వేములవాడరూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 32 మంది డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డారు. వీరిని వేములవాడ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నలుగురికి జైలుశిక్ష, 28 మందికి జరిమానా విధించారని వేములవాడ రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. 32 మందిలో ఇద్దరికి ఐదు రోజులు, మరో ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్ష, జరిమానా విధించారని పేర్కొన్నారు. మొత్తం రూ.64 వేలు జరిమానా విధించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మధ్యం సేవించిన పది మందికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా వేశారు. అలాగే వేములవాడ పట్టణ పరిధిలో డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన 75 మందిని కోర్టులో హాజరుపరుచగా కొందరికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. నలుగురికి రెండు రోజుల జైలు, రూ.2,500 జరిమానా, ఐదుగురికి ఒక రోజు జైలు, రూ.2,500 జరిమానా, ఏడుగురికి మూడురోజుల జైలు, రూ.2,500 జరిమానా, 41 మందికి రూ.1500 జరిమానా, 18 మందికి రూ.2,500 జరిమానా విధించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment