ఆరు..నూరైనా తగ్గేదేలే!
● అలుపెరగని పరుగువీరులు ● బరిలో దిగితే పతకాలు ఖాయం
● ఆరుపదుల వయసులో అథ్లెట్స్‌గా రాణిస్తున్న సీనియర్స్
అమెరికా పోటీల్లో పాల్గొంటా..
మాది పెద్దపల్లి పట్టణం. ట్రాన్స్‌కోలో ఇంజినీర్‌గా ఉద్యోగ విరమణ చేసిన. ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాలు సాధించా. చైనా, థాయ్‌లాండ్, అమెరికా తదితర దేశాల్లో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు గెలిచా. ఆదివారం (ఈనెల 19న) హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొంటా. అలాగే మార్చిలో ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో జరిగే పోటీల్లో పాల్గొంటా. రిటైర్డ్ అయి ఇంటివద్దే ఉంటున్నా.. ఏ పని పాట లేకపోతే రోగాలు దరి చేరే ప్రమాదముంది. అందుకే వృద్ధాప్యంలోనూ చురుకుగా ఉండేందుకు నిత్యం వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తూ అవకాశం ఉన్నప్పుడు అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటున్నా. 1983లో ఉస్మానియా యూనివర్సిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యా. – తూముల మనోహర్‌రావు, పెద్దపల్లి
ఇంకా పతకాలు సాధిస్తా..
2016లో హైజంప్‌లో జాతీ యస్థాయి పతకం సాధించా. 2014, 2015లో స్టేట్ లెవల్‌లో ట్రిపుల్ జంప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన. జావెలిన్‌త్రో, హైజంప్, లాంగ్ జంప్‌లో పతకాలు సాధించాను. 2016లో విదీశలో జాతీయస్థాయిలో సిల్వర్ మెడల్‌ను అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చేతులమీదుగా అందుకున్నాను. ఆరు పదులు దాటినా ఇంకా ఎన్నో పతకాలు సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న. – గొట్టె అంజయ్య (66 ఏళ్లు),
వెటరన్ అథ్లెట్, వెంకటాపూర్
అందరినీ ఒక్క చోటకు చేర్చిన
జిల్లాలో అనేక మంది మాస్టర్ అథ్లెటిక్స్ ఉన్నారు. అయితే వారంతా రిజిస్టర్ చేసుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 20 మందిని రిజిస్టర్ చేయించాను. వీరంతా రిటైర్‌మెంట్ వయసులోనూ తమ కలలను నిజం చేసుకునేందుకు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే కృషితో వివిధ పోటీల్లో పాల్గొంటున్నారు. పాల్గొన్న ప్రతీ పోటీల్లో దాదాపు పతకాలు సాధిస్తున్నారు. ఇటీవల త్రిచూర్‌లో జరిగిన పోటీల్లో 17 ఈవెంట్లకు 12 పతకాలు మన జిల్లా మాస్టర్ అథ్లెట్స్ సాధించడం గర్వంగా ఉంది.
– మునీందర్‌రెడ్డి (64 ఏళ్లు), రాజన్న సిరిసిల్ల జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ
Comments
Please login to add a commentAdd a comment