మోర్తాడ్(బాల్కొండ): విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసగించడమే కాకుండా వలస కార్మికులను తమ వద్ద బందీలుగా చేసుకుని, ఇంటికి పంపించాలంటే కొంత డబ్బు ను బలవంతంగా వసూలు చేసిన ఏజెంట్ల ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజా మాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్‌పల్లికి చెందిన సాగర్, జగిత్యాల్ జిల్లా మోహన్‌రావుపేట్‌కు చెందిన అరవింద్ దగ్గరి బంధువులు. ఇక్కడ సరైన ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్లాలని భావించారు. వీరిని గమనించిన మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన ఒక ఏజెంట్ థాయ్‌లాండ్‌లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఒక్కో వీసాకు రూ.5 లక్షలు చెల్లించాలని తెలిపాడు. అక్కడ నెలకు రూ.1.50 లక్షల కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చని ఏజెంట్ చెప్పి న మాటలు నమ్మిన సాగర్, అరవింద్ రూ.5 లక్షల చొప్పున చెల్లించి గతేడాది నవంబర్‌లో ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లారు. అక్కడి నుంచి థాయ్‌లాండ్ బోర్డర్ దాటించడానికి మరికొద్ది మంది దళారులను ఏజెంట్లే నియమించారు. అక్కడే దళారులు సాగర్, అరవింద్‌లను బందీలుగా చేసుకుని అసలు నాటకానికి తెర లే పారు. బాధితుల నుంచి మొబైల్ ఫో న్లు లాక్కుని ఇంటికి మాట్లాడకుండా చేశారు. కొన్ని రోజుల తర్వాత థాయ్ లాండ్‌లో తమవారు కనిపించకుండా పోయారని సాగర్, అరవింద్ కుటుంబ సభ్యులు డిసెంబర్‌లో ప్ర వాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతోనే ఏజెంట్ల మోసం బయటపడింది.
ఏజెంట్ అరెస్టుతో
బందీల ఆచూకీ..
ప్రవాసీ ప్రజావాణి గ్రీవెన్స్ సెల్ ప్రత్యేకాధికారి దివ్యదేవరాజన్ స్పందించి ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అధికారి షికా గోయెల్‌కు సాగర్, అరవింద్‌ల సమస్యను వివరించడంతో పోలీసుల్లో చలనం వచ్చింది. ఆత్మకూర్‌కు చెందిన ఏజెంట్ సమ్మెట రాజును మోర్తాడ్ పోలీసులు అరెస్టు చేసి రి మాండ్‌కు తరలించారు. ఏజెంట్ తన అరెస్టు సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని మరో ఏజెంట్‌కు వెల్లడించడంతో అతను అక్కడ బందీగా ఉన్న సాగర్, అరవింద్‌తో వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో మాట్లాడించడం మొదలు పెట్టారు. ఒక రోజు ఫోన్‌లో మాట్లాడించడానికి మన కరెన్సీలో రూ.1,500 నుంచి రూ.2 వేలు పంపించాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబ సభ్యులు వివరించా రు. అలా దళారులు బాధిత కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు లాగ డం మొదలు పెట్టి చివరకు తమ చెరలో ఉన్న వారిని ఇంటికి పంపించాలంటే రూ.2 లక్షల చొప్పున తాము సూచించిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. తమవారు క్షేమంగా ఇంటికి వస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఇటీవల రూ.4 లక్షలు చెల్లి ంచడంతో సాగర్, అరవింద్ వారం క్రితం ఇంటికి చేరుకున్నారు.
థాయ్‌లాండ్‌లో బంధించి వలస కార్మికుల వద్ద వసూళ్లు
ఇరు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున నష్టం
Comments
Please login to add a commentAdd a comment