ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
వెల్గటూర్(ధర్మపురి): భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎండపల్లి మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎండపల్లికి చెందిన మానుపాటి రమేశ్ (38)కు 22 ఏళ్ల క్రితం చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన పద్మతో వివాహం జరిగింది. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2017లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ప్రస్తుతం కేసు నడుస్తోంది. భార్య కాపురానికి రాకపోవడంతో రమేశ్ కొన్నేళ్లుగా తన అత్తవారింటి వద్దే ఉంటున్నాడు. కానీ, అతడికి అక్కడ ఉండడం ఇష్టంలేదు. ఈ విషయమై తల్లితో ఎప్పుడూ చెబుతూ బాధపడేవాడు. నాలుగు నెలల క్రితం ఎండపల్లికి వచ్చి తల్లి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తల్లి నిద్ర లేచేసరికి కొడుకు ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా ఇంటి పక్కన గల చెట్టుకు ఉరేసుకొని మృతిచెంది ఉన్నాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి తల్లి లచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
యువతి..
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గోవిందరావుపేటతండా(బావుసాయిపేట)కు చెందిన యువతి బానోత్ గంగోత్రి(23) రెండేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతోంది. మతిస్థిమితం కూడా సరిగ్గా ఉండడం లేదు. దీంతో తల్లిదండ్రులు వేములవాడ, సిరిసిల్లలోని వివిధ హాస్పిటల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. వారం రోజులుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలోనే మనస్థాపానికి గురైన గంగోత్రి శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుంది. గంగోత్రి తండ్రి బానోతు లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment