స్పృహ కోల్పోయిన డ్రైవర్.. తప్పిన ప్రమాదం
మెట్పల్లి(కోరుట్ల): ఆర్టీసీ అద్దె బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ స్పృహ కోల్పోయిన ఘటన శనివారం మెట్పల్లి పట్టణంలో జరిగింది. స్థానికుల వివరాలు.. టీఎస్02 యూబీ 0228 నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు మెట్పల్లి నుంచి రాయికల్‌కు వెళ్తుండగా, మార్గమధ్యలో స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆపిన సమయంలో డ్రైవర్ సతీశ్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. గమనించిన కండక్టర్, ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌ను రప్పించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను డిపో మేనేజర్ దేవరాజ్ పరామర్శించారు. బస్సు ఆగిన సమయంలో ఘటన జరగడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని ప్రయాణికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment