ఎమ్మెల్సీగా గెలిచి హైకమాండ్‌కు గిఫ్ట్ ఇస్తా
కరీంనగర్ కార్పొరేషన్: ఎమ్మెల్సీగా తన గెలుపుతో పార్టీ అధిష్టానానికి బహుమతి అందిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ విజయం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు బాట వేయాల్సి ఉందన్నారు. ఆదివారం నగరంలోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ అధిష్టానం, సహకరించిన సీఎం, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రులు, నాయకులకు ధన్యవాదా లు తెలిపారు. పట్టభద్రులకు సేవకుడిగా పని చేస్తానన్నారు. ఈనెల 7న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేష న్ దాఖలు చేస్తున్నామని, తరువాత 10న భారీ ర్యా లీతో మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్న ట్లు వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు, పార్టీ పెద్దలు పాల్గొంటారన్నారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అఽ ద్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే ఆరెపల్లి మోహన్, మాజీ కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, కాశెట్టి శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, ఆకారపు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి: తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తె పట్టభద్రులకు చేదోడువాదోడుగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. కర్ర సత్యప్రసన్నారెడ్డి, గుర్రం భూమారెడ్డి, చిలుక రవీందర్, గుర్రం రాజేందర్‌రెడ్డి, గుర్రం హన్మంతరెడ్డి, కేతిరెడ్డి మణిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment