సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తా
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి
కరీంనగర్: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని, మరోసారి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఆశీర్వదించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ప్రభుత్వ అధ్యాపక జేఏసీ, ఎస్టీయూ టీఎస్, టీపీఆర్టీయూ సంఘాల ఆధ్వర్యంలో సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి అభ్యర్థిగా మరోసారి టీచర్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్నానని అన్నారు. అధ్యాపక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పర్వతరెడ్డి, సదానందంగౌడ్, టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన కూర రఘోత్తమరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. వివిధ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు రఘోత్తమరెడ్డికి మద్దతు పలికారు. పీఆర్ శ్రీనివాస్, కట్టా రవీంద్రచారి, పాతూరి రాజిరెడ్డి, గోనే శ్రీనివాస్, శనిగరపు రవి, కనకయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment