రూ.11,157 కోట్లతో బెంగళూరు పద్దు
బనశంకరి: రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బృహత్ బెంగళూరు మహానగర పాలికె బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పెంపు లేకుండా రూపొందించింది. 2023–24 బీబీఎంపీ బడ్జెట్‌ను రూ.11,157 కోట్ల పద్దుతో అధికారులు గురువారం టౌన్‌హాల్‌లో ప్రవేశపెట్టారు. ఇందిరాక్యాంటీన్, చెత్తనిర్వహణ, చెరువులు సంరక్షణ, విద్య, ఆరోగ్య, పరిపాలన, మౌలిక వసతులతో పాటు ఇతర విభాగాలకు నిధులు ఎక్కువగా కేటాయించారు. బీబీఎంపీ పాలనాధికారి రాకేశ్‌సింగ్, కమిషనర్ తుషార్ గిరినాథ్ సమక్షంలో పాలికె ఆర్థిక శాఖ విభాగ ప్రత్యేక కమిషనర్ జయరామ్ రాయపుర బడ్జెట్ ను ప్రకటించారు. గతేడాది పాలికె బడ్జెట్ రూ.10,478 కోట్లుగా ఉండింది. ఈసారి రూ.670 కోట్లకుపైగా పెరిగింది.
ఇన్‌చార్జ్ మంత్రికి రూ.250 కోట్లు
● ప్రజాపనులకు రూ.7103.53 కోట్లు కేటాయించగా, పొడిచెత్త నిర్వహణకు రూ.1643.72 కోట్లు, ఆరోగ్య వైద్యరంగానికి రూ.103.32 కోట్లు, ఉద్యానవనశాఖ రూ.129.85 కోట్లు కేటాయించారు. పరిపాలన వ్యయం రూ.602 కోట్లు, రాబడి రూ.524 కోట్లుగా తెలిపారు. మిగులు రూ.6.14 కోట్లుగా తెలిపారు.
● అభివృద్ధి పనుల కోసం బెంగళూరు నగర ఇన్‌చార్జ్ మంత్రికి రూ.250 కోట్లు కేటాయింపు
● మేయర్ కు రూ.100 కోట్లు, కమిషనర్‌కు రూ.50 కోట్లు కేటాయింపు
రోడ్ల వైట్ ట్యాపింగ్‌కు రూ.1,410 కోట్లు
● ఇందిరా క్యాంటీన్ల నిర్వహణకు రూ.50 కోట్లు,
● 150 కిలోమీటర్ల మేర రోడ్ల వైట్‌టాపింగ్ పనులకు రూ.1,410 కోట్లు
● ప్రతి వార్డుకు రూ.75 లక్షల మంజూరు, ఇందుకు మొత్తం రూ.182.25 కోట్లు
● 75 ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్దికి రూ.150 కోట్లు
● వీధి దీపాల నిర్వహణకు రూ.38 కోట్లు
● చెరువుల నిర్వహణ రూ.35 కోట్లు
● భూ స్వాధీన ప్రక్రియలకు రూ.100 కోట్లు
● ఖాళీ స్థలాల సంరక్షణకు రూ.40 కోట్లు
● వివిధ ఇంజనీరింగ్ విభాగం పనులకు రూ.25 కోట్లు
● కొత్త పార్కుల ప్రగతికి రూ.15 కోట్లు
● కొత్త స్మశానాల నిర్మాణానికి రూ.30 కోట్లు
● చెరువులు అభివృద్ధికి రూ.50 కోట్లు
● బీబీఎంపీ ఉద్యోగులకు ఏటా నాడప్రభు కెంపేగౌడ ఆవిష్కార పురస్కారం, రిటైర్డు ఉద్యోగుల సంక్షేమానికి రూ.10 కోట్లు కేటాయించారు. అధికారులు సిబ్బందిలో గుణాత్మక మార్పులు పెంచడానికి కెంపేగౌడ ఆవిష్కార పురస్కారం అందిస్తారు. విజేతకు రూ.2 లక్షల నగదు బహుమతి లభిస్తుంది.
మరో ఫ్లై ఓవర్
● రూ.345 కోట్లతో ఎలివేటెడ్ రోటరీ పై వంతెనను నిర్మాణం
● పనిచేసే మహిళల వసతి నిలయాలకు రూ.24 కోట్లు
● పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.100 కోట్లు
● విద్యార్థుల ల్యాప్‌టాప్ వితరణకు రూ.25 కోట్లు, స్కాలర్‌షిప్‌లకు రూ.5 కోట్లు.
చెరువుల సంరక్షణ, ఇందిరా
క్యాంటీన్, విద్య, వసతులకు పెద్దపీట
బడ్జెట్‌పై రాబోయే అసెంబ్లీ
ఎన్నికల ముద్ర
మురికివాడలకు రూ.80 కోట్లు
మురికివాడల అభివృద్దికి రూ.80 కోట్లు, రాజ కాలువలభివృద్దికి రూ.45 కోట్లు
పాలికె ఆస్తుల సంరక్షణ, రికార్డులు సేకరణ, చైన్–లింక్ ఫెన్సింగ్ వేయడం, బోర్డులు అమర్చడానికి రూ.40 కోట్లు.
వార్డుల్లో ఆరోగ్య విభాగం కార్యక్రమాల కోసం సిబ్బంది నియామకం
పొడిచెత్త నిర్వహణకు రూ.700 కోట్లు కేటాయింపు
వీధి కుక్కల నియంత్రణ పనులకు రూ.20 కోట్లు
కొత్త వలయాల ఉద్యానవనాలకు రూ.35 కోట్లు
పాత వలయాల ఉద్యానవనాలకు రూ.45 కోట్లు
నగరంలో చెట్ల గణనకు రూ.4 కోట్లు, మొక్కలు నాటడం, నిర్వహణకు రూ.7.5 కోట్లు
పై వంతెనల పనులకు రూ.145 కోట్లు కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment