మాట్లాడుతున్న బ్రహ్మానందం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం పరిధి మంచేనహళ్లిలోని గౌరిబిదనూరు రోడ్డులో శనివారం సాయంత్రం సినీ నటులు కిచ్చ సుదీప్, తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం తదితరులు బీజేపీ అభ్యర్థి తరఫున భారీ రోడ్‌షో నిర్వహించారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ...తాను హైదరాబాద్ నుంచి చిక్కబళ్లాపురానికి సుధాకర్ తరఫున ప్రచారం కోసం వచ్చానని, తెలుగు ఓటర్లు సుధాకర్‌ను గెలిపించాలని, బీజేపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందని వివరించారు. కిచ్చ సుదీప్ మాట్లాడుతూ...సుధాకర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వరుణకు సిద్దు చేసిందేమీ లేదు
మైసూరు: వరుణలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సిద్దరామయ్య కలలు కంటున్నారు, అవి నెరవేరవని బీజేపీ అభ్యర్థి మంత్రి. వి.సోమన్న అన్నారు. ఆదివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వరుణ అభివృద్ధిని ఆయన పట్టించుకోలేదని, దాంతో ఇక్కడి ప్రజలు ఆయన పైన గుర్రుగా ఉన్నారని అన్నారు. ఎలాగైనా వరుణలో ఆయనను ఓడిస్తానని, ప్రజలు కూడా ఇదే చెబుతున్నారని అన్నారు. ఆయన సీఎంగా ఉండగా వరుణలో ఒక ప్రభుత్వ పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేదని చెప్పారు.
అభివృద్ధిని చూసి ఓటు వేయండి
యశవంతపుర: యశవంతపుర నియోజకవర్గంలో 17 గ్రామ పంచాయతీలలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీజేపీ అభ్యర్థి ఎస్టీ సోమశేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన కెంగేరిలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తను చేసిన అభివృద్ధి తనకు శ్రీరామరక్ష అన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
జేడీఎస్ రోడ్డు షో
యశవంతపుర జేడీఎస్ అభ్యర్థి జవరాయగౌడ ఆదివారం కెంగేరి ఉపనగరలో కార్యకర్తలతో కలిసి రోడ్డుషో నిర్వహించారు. ఈ సారి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పంచరత్న పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు రాముసంజీవయ్య, కృష్ణ, చేతన్‌గౌడలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment