కృష్ణరాజపురం: ఉద్యోగం ఇచ్చిన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి బాయ్ ఫ్రెండ్, తన ఇద్దరు చెల్ళెల్లు, వారి బాయ్ ఫ్రెండ్స్ ఖాతాలకు నగదు పంపించిన కేసులో నగరంలోని విద్యారణ్యపుర పోలీసులు ముగ్గురు యువతులను, ఒక యువకున్ని అరెస్టు చేశారు. విద్యారణ్యపుర పరిధిలో ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తున్న వెంకటేష్‌రెడ్డి ఖాతాను వీరు కొల్లగొట్టారు. వివరాలు.. తన కంపెనీలో గణవి అలియాస్ రీతూ అనే యువతిని రిసెప్షనిస్టుగా ఉద్యోగం ఇచ్చాడు.
ఆమె కంపెనీ బ్యాంకుల ఖాతాల నగదు, ఫోన్ పే, గూగుల్ పే ఖాతాల నుంచి నగదు లావాదేవీలను నిర్వహించేది. ఇలా లక్షల రూపాయల నగదు లావాదేవీలు జరిపిన రీతూలో దుర్బుద్ధి పుట్టింది. తన బాయ్‌ఫ్రెండ్ నక్షు కుశాలప్పకు, అలాగే చెల్లెల్లు రియా, సిరిలకు ఫోన్ పే ద్వార రూ. 2.70 లక్షలను పంపించింది. చెల్లెళ్ల స్నేహితులైన మల్లేష్, రాహుల్‌కు కూడా ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేసింది. కొన్ని రోజుల కిందట వెంకటేష్‌రెడ్డి మొబైల్‌ఫోన్‌కి అలర్డ్ మెసెజ్‌లు రావడంతో తనిఖీ చేయగా, గుర్తు తెలియని ఖాతాలకు నగదు వెళ్ళినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment