భూమిపూజ చేస్తున్న కలెక్టర్ తదితరులు
హోసూరు: హోసూరు నియోజకవర్గంలో రహదార్ల శాఖ ద్వారా రూ. 186 కోట్ల ఖర్చుతో రోడ్ల అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ శరయు, ఎమ్మెల్యే వై. ప్రకాష్ ప్రారంభించారు. హోసూరు కార్పొరేషన్, తళి, డెంకణీకోట, కెలమంగలం, టివిఎస్ ప్రాంత రోడ్లను నాలుగు లేన్ల రోడ్లుగా మార్చేందుకు రహదార్ల శాఖ నిధులు మంజూరు చేసింది. ఈ నిధిలతో ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి హోసూరులోని శిష్యా పాఠశాల వరకు రూ. 42 కోట్ల ఖర్చుతో, టీవీఎస్ కంపెనీ నుంచి మత్తిగిరి కూడలి రోడ్డు వరకు రూ. 78 కోట్ల ఖర్చుతో తదితర ప్రాంతాల్లో మొత్తం 186 కోట్ల ఖర్చుతో రోడ్లు నిర్మిస్తారు. మేయర్ సత్య, కమిషనర్ స్నేహ, సబ్‌కలెక్టర్ శరణ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment