పట్టణంలోని సయ్యద్ హజరత్ గౌస్ ఏ షా వలీ దర్గా
కేజీఎఫ్: తాలూకాలోని పారాండహళ్లి జీపీ బీరనకుప్పె గ్రామం వద్ద ఉన్న సయ్యద్ హజరత్ గౌస్ ఏ షా వలీ దర్గాలో ప్రతి యేటా నిర్వహించేలా 16వ తేదీన ఉరుసు నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ పదాధికారులు తెలిపారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన దర్గాలో హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరూ దర్గాలో బాబా దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. పలు వ్యాధులతో బాధపడుతున్న వారు దర్గాకు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళతారని తెలిపారు. ఉరుసుకు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళునాడు ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మంది ఉరుసులో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
17న తాలూకా స్థాయి
జనతా దర్శన్
శ్రీనివాసపురం: పట్టణంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు తాలూకా స్థాయి జనతా దర్శన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా దర్శన్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. తాలూకా స్థాయి అధికారులు అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో టీపీ ఈఓ ఎస్ శివకుమారి, బీఈఓ కె భాగ్యలక్ష్మి, ఆర్‌ఐ బి.వి.మునిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment