![కప్‌తో వినోద్‌రాజ్(ఫైల్), పెళ్లినాటి ఫొటో - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/8/07bng103_mr.jpg.webp?itok=y7hIPvrb)
కప్‌తో వినోద్‌రాజ్(ఫైల్), పెళ్లినాటి ఫొటో
యశవంతపుర: కబడ్డీ క్రీడాకారుడి ప్రేమ విషాదాంతమైంది. నాలుగేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి..మూడు రోజులకే పుట్టింటికి వెళ్లింది. మనో వేదనతో విషం తాగిన వరుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకాలో జరిగింది. తేగూరు గ్రామానికీ చెందిన జాతీయ కబడ్డీ ఆటగాడు వినోద్ రాజ్ (24) తన తల్లిదండ్రులకు ఒకే కుమారుడు. ఇతను నాలుగేళ్లుగా ఆదే గ్రామానికి చెందిన తనుజాను ప్రేమించాడు. గత ఏడాది డిసెంబర్ 10న ఇంటి నుంచి ఇద్దరూ పారిపోయి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ వివాహాన్ని యువతి కుటుంబం వ్యతిరేకించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధూవరులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టి తిరిగి పంపించేశారు. తర్వాత మూడు రోజులకే ఆ యువతి తాళిని వినోద్‌రాజ్‌కు ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. మనోవేదనకు గురైన అతను ఈ నెల 2న ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి మంగళూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినోజ్‌రాజ్ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment