సురపుర విజేత ఎవరో? | Sakshi
Sakshi News home page

సురపుర విజేత ఎవరో?

Published Tue, May 7 2024 3:55 AM

సురపు

రాయచూరు రూరల్‌: యాదగిరి జిల్లాలోని సురపుర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజేత ఎవరో అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థిగా రాజుగౌడ అలియాస్‌ నరసింహ నాయక్‌, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే దివంగత రాజా వెంకటప్ప నాయక్‌ కుమారుడు రాజా వేణుగోపాల నాయక్‌ పోటీ పడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు గౌడ మంత్రిగా విధులు నిర్వహించారు. కాంగ్రెస్‌ కంచుకోటలో రాజుగౌడ విజయం సాధించి మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. మూడు నెలల కిందట మృతి చెందిన ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజారిటీతో రాజుగౌడను ఓడించారు. అయితే గుండెపోటుతో మరణించారు. యడియూరప్ప మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన రాజుగౌడ నాడు కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేశారు. రాజవంశస్థుడిగా పేరొందిన రాజా వేణుగోపాల నాయక్‌ బరిలో నిలిచారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుభవంతో కూడిన రాజకీయ నాయకుడు రాజుగౌడ తండ్రి మరణంతో సానుభూతి ఆధారంగా గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రె్‌స్‌ పార్టీ పంచ గ్యారెంటీలతో ప్రజల ముందుకు వెళుతున్నారు. బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే పెద్ద ప్రచారకర్తగా ఉన్నారు. సురపుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2,83,083 మంది ఓటర్లున్నారు. ఈనేపథ్యంలో ఓటర్ల మొగ్గు ఎవరివైపో వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే కుమారుడు

బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పోటీ

నేటి ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

సురపుర విజేత ఎవరో?
1/2

సురపుర విజేత ఎవరో?

సురపుర విజేత ఎవరో?
2/2

సురపుర విజేత ఎవరో?

Advertisement

తప్పక చదవండి

Advertisement