బనశంకరి: హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న కన్నడ టీవీ నటి శోభితా శివణ్ణ మృతదేహానికి మంగళవారం స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు జరిపారు. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా హేరూరు గ్రామంలో కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో కన్నీటి వీడ్కోలు పలికారు. టీవీ సీరియళ్లలో ఎప్పుడూ హుషారుగా కనిపించే శోభితను అలా చూసేసరికి బంధుమిత్రులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment