చాముండికొండపై దొర్లిన బండ
మైసూరు: రెండు రోజులుగా ఫెంగల్ తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని చాముండికొండపై రోడ్డుపైకి భారీ బండరాయి దొర్లిపడింది. ఆ మార్గంలో కొండపైకి వస్తున్న ఓ బస్సు వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. వాహనాల రద్దీ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. కొంతసేపు ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు చేరుకుని పరిశీలించి జేసీబీ యంత్రంతో బండరాళ్లను తొలగించే పనులు చేపట్టారు. చాముండేశ్వరి దేవి తమను కాపాడిందని స్థానికులు, బస్సులో ఉన్న ప్రయాణికులు పేర్కొన్నారు. ఏకధాటిగా కురుస్తోన్న వానలతో కొండపై నుంచి మన్ను, చిన్న చిన్న రాళ్లు, బండలు జారిపడుతున్నాయి. తుపాను వల్ల మైసూరులోని
సరస్వతీపురంలో రెండు చెట్లు నేలకూలాయి. దీంతో ఇంటి ముందు నిలిపిన రెండు కార్లు ధ్వంసమయ్యాయి. జోరు వానల వల్ల మైసూరు ప్యాలెస్‌కు పర్యాటకులు తగ్గిపోయారు. వ్యాపారాలు, ట్రాఫిక్ రద్దీ తగ్గిపోయాయి.
తృటిలో బయటపడిన బస్సు
Comments
Please login to add a commentAdd a comment