స్ప్రింగుల్లా యోగా
తుమకూరు: తుమకూరు నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో యోగాసన భారత్, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదవ జాతీయ సీనియర్ యోగా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. యోగాభ్యాసకుల విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. ఆదివారం సంగీతానికి తగినట్లు యోగాసనాలు, సామూహిక విన్యాసాల పోటీలు జరిగాయి. యువతీ, యువకుల జట్లు ప్రతిభతో ఆకట్టుకున్నాయి. శరీరాన్ని రకరకాల భంగిమల్లో సర్పాల మాదిరిగా వంచడం చూసి అందరూ ఔరా అనుకున్నారు.
అబ్బురపరచిన పోటీలు
Comments
Please login to add a commentAdd a comment