అమిత్ షాపై ఆగని నిరసనలు
సాక్షి బళ్లారి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బళ్లారిలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం కూడా నగరంలో వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేరు వేరుగా జిల్లాధికారి కార్యాలయం వద్ద ధర్నాలు చేశారు. కర్ణాటక రాష్ట్ర శోషిత సముదాయాల మహాకూటమి ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రాలను పట్టుకొని జైభీం అంటూ నినాదాలు చేశారు. అలాగే డీఎస్‌ఎస్(బీ.కృష్ణప్ప వర్గం) ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నేతలు ముండ్రిగీ నాగరాజు, వెంకటేష్‌హెగ్డే, నాగరాజు, లక్ష్మిపతి, తదితరులతో పాటు డీఎస్‌ఎస్ ప్రముఖులు గాధిలింగప్ప, హుస్సేనప్ప, దుర్గప్ప తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షా రాజీనామా చేయాలి
రాయచూరు రూరల్: లోక్‌సభలో అంబేడ్కర్‌ను అవమానించే విధంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని చిక్కోడి ఎంపీ ప్రియాంక జార్కిహోళి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం దేవదుర్గలో తనను కలసిన విలేకర్లతో మాట్లాడారు. సభలో అంబేడ్కర్ అనే పదం ఫ్యాషన్‌గా మారిందని పేర్కొనడాన్ని ఆమె ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల దేశంలో శాంతికి భంగం వాటిల్లుతుందన్నారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీ పథకాలు సక్రమంగా జరుగుతున్నాయన్నారు.
హొసపేటె: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని హొసపేటెలో దళిత, అభ్యుదయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇక్కడి అంబేడ్కర్ సర్కిల్లో అమిత్‌షా చిత్రపటాన్ని దహనం చేశారు. ఆందోళనలో మారడి జంబయ్య నాయక, తాయప్ప నాయక, పంథామానె సోమశేఖర్, ఎన్.వెంకటేష్, బిసాటి మహేష్, సన్నమారెప్ప, ఈడిగర మంజునాథ్, ఎల్ మంజునాథ్, భాస్కర్‌రెడ్డి, యల్లాలింగ కలంగల్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment