నేరాల నియంత్రణపై జాగృతి జాతా
బళ్లారి అర్బన్: నేరాల నియంత్రణపై శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాగృతి జాతా నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక ఎస్పీ కార్యాలయం వద్ద ఐజీ లోకేశ్, ఎస్పీ శోభారాణి, సీనియర్ సివిల్ నాయ్యమూర్తి రాజేష్ హొసమణి జాతాను ప్రారంభించారు. జాతాలో వివిధ విద్యా సంస్థల విద్యార్థులు ఎన్‌సీసీ క్యాడెట్లు, రెడ్‌క్రాస్ సంస్థ పదాధికారులు, విశ్రాంత పారామిలటరీ సంఘం, ఇతర సంస్థలు పాల్గొన్నాయి. జాతా దుర్గమ్మ సర్కిల్, వాల్మీకి సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, హెచ్‌ఆర్ గవియప్ప సర్కిల్, గడిగిచెన్నప్ప సర్కిల్ మీదుగా సాగింది. ఈసందర్భంగా రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల పట్ల చైతన్యం కల్పించారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ రోడ్డు భద్రతపై ప్రదర్శన నిర్వహించింది. సిరుగుప్ప డీఎస్పీ వెంకటేష్, డీఏఆర్ డీఎస్పీ తిప్పేస్వామి, ట్రాఫిక్ సీఐ అయ్యనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియమాలపై అవగాహన
రెడ్‌క్రాస్ సంస్థ బళ్లారి శాఖ, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాలంటీర్ల నేతృత్వంలో ప్రమాదాలపై దుర్గమ్మ గుడి సర్కిల్లో ప్రదర్శన నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచంలో ఏటా లక్షన్నర మంది ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment