ఘాటి.. భక్తజన కోటి
● వైభవంగా సుబ్రమణ్య రథోత్సవం
రథోత్సవ దృశ్యం
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలోని దక్షిణభారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఘాటి సుబ్రమణ్యస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారంనాడు ఘనంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తజనం తరలివచ్చారు. తెల్లవారు జాము నుండే దేవాలయంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. వేలాదిగా భక్తులు బారులుతీరి స్వామి దర్శనం చేసుకున్నారు. తేరు వేడుక నేత్రపర్వంగా జరిగింది. భక్తులు నాగ విగ్రహాలకు కుజదోషం, నాగదోషం నివారణ పూజలను చేశారు. దర్శనానికి వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment