నక్సల్ నేతల శాంతి సందేశం!
యశవంతపుర: అడవుల్లో ఉండిపోయిన నక్సలైట్లను జన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ప్రముఖ నక్సలైట్ ముండగారు లతతో పాటు ఆరు మంది త్వరలో జన వసంతంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముండగారు లత, సుందరి కుల్లూరు, వనజాక్షి బాళెహొళె, మారెప్ప అరోళి, కె వసంత, టిఎన్ జీశ్‌ల లొంగుబాటుకు సర్కారు యత్నిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, ఇంటెలిజెన్స్ అధికారులతో వారి తరఫున నక్సల్ శరణాగతి సమితి, శాంతగారి నాగరిక వేదిక సభ్యులు అనేకసార్లు చర్చించినట్లు తెలిసింది.
అరెస్టులతో వేధించరాదు
పోరాట మార్గాన్ని వదిలి ప్రజాస్వామ్య మార్గాల్లో ఉద్యమాలకు ప్రభుత్వం ఒప్పుకొంది. వారు జైల్లోనే ఉండే స్థితి ఉండరాదు. జన స్రవంతిలోకి వస్తున్న నక్సల్‌కు ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకోవాలి. వీరిని సంబంధంలేని కేసుల్లో చేర్చి ఇబ్బంది పెట్టరాదు. లొంగిపోయిన తరువాత త్వరగా బెయిల్ ఇవ్వాలని ఆ సభ్యులు మనవి చేశారు. కేసుల వాదనల్లో కానూను సేవా ప్రాధికారం నుంచి సాయం చేసే హామీనిచ్చిన్నట్లు సమాచారం. వీరిపై నమోదైయిన అన్నీ కేసులను ప్రత్యేక కోర్టులో త్వరగా పరిష్కరించేలా చూస్తారు. అలాగే వారి స్థాయిని బట్టి నక్సల్‌కు రూ.7.50 లక్షలు, రూ.4 లక్షలు చొప్పున మూడు విడతలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. నక్సలైట్ల డిమాండ్లు సరైనవిగా ఉన్నట్లు శాంతిగాగి నాగరక వేదిక నేత కెఎల్ అశోక్ తెలిపారు. నక్సలైట్ల విన్నపాలను సర్కారుకు తెలియజేసినట్లు చెప్పారు. అడవుల్లో సంచారం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు, కూంబింగ్ పెరిగి ఎన్‌కౌంటర్లు జరగడం తదితర కారణాలతో పలువురు నక్సలైట్లు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం.
లొంగుబాటుకు సంకేతాలు
సర్కారుతో దూతల చర్చలు
సహాయానికి వాగ్దానం
Comments
Please login to add a commentAdd a comment