యశవంతపుర: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ అనుమానిత వైరస్ సోకిన 8 నెలల శిశువు మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఆరోగ్యం బాగుపడడంతో ప్రైవేట్ ఆస్పత్రి నుంచి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. బీబీఎంపీ ఆరోగ్యాశాఖ అధికారులు ఆస్పత్రికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. నగరంలో ఇద్దరు శిశువులకు వైరస్ సోకినట్లు గుర్తించగా ఇద్దరూ ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు.
క్యాటరింగ్ వ్యాపారి ఆత్మహత్య
యశవంతపుర: క్యాటరింగ్ నిర్వహిస్తున్న వ్యాపారి నష్టాల బాధతో లాడ్జిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు హుళిమావు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గుజరాత్‌కు చెందిన కులాల్‌దత్తు (50) మరొకరితో కలిసి నగరంలో క్యాటరింగ్ నడుపుతున్నాడు. అయితే వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీనికి తోడు భాగస్వామి మోసం చేశాడని విరక్తి చెందాడు. సోమవారం సాయంత్రం హుళిమావులోని ఒక లాడ్జికి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయమైనా బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానం వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే సమాచారం ఇవ్వగా, స్థానిక పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment