దొంగల ముఠాల ఆటకట్టు
బనశంకరి: బెంగళూరు నగరంలోని కొత్తనూరు, బేగూరు, తలఘట్టపుర, హెణ్ణూరు తదితర పోలీస్టేషన్ల పోలీసులు 7 మంది దొంగలను అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.80 లక్షల విలువచేసే నగదు, నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. బుధవారం చోరీ సొత్తును పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.
ఎక్కడెక్కడ చోరీలు
● కొత్తనూరుకు చెందిన వ్యక్తి బ్యాంక్ లాకర్ నుంచి బంగారు, వెండి ఆభరణాలు తీసుకుని వెళుతుండగా దుండగులు అడ్డుకుని దోచుకున్నారు. ఈ కేసులో దొంగలను అరెస్ట్ చేసి రూ.1.10 లక్షలు విలువచేసే బంగారాన్ని సీజ్‌చేశారు. బాలాజీ లేఔట్, ఇతర చోట్ల చోరీకి పాల్పడిన రూ.23 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
● బేగూరులో ఇంటి తాళం పగలగొట్టి రూ.18.53 లక్షలు విలువచేసే 261 గ్రాములు బంగారాన్ని ఎత్తుకెళ్లి ఫైనాన్స్ సంస్థల్లో కుదువ పెట్టారు. ఆ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.
● తలఘట్టపురలో ఒంటరిగా వెళుతున్న మహిళలను వెంబడించి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన 260 గ్రాముల నగలను సీజ్ చేశారు.
● హెణ్ణూరులో ఇంటి కిటికీ పక్కన పెట్టిన తాళం తో ఇంటి తలుపుతీసి నగలు ఎత్తుకెళ్లిన మహిళా దొంగ పట్టుబడింది. ఆమె నుంచి రూ.7.80 లక్షల విలువచేసే 110 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు.
రూ.80 లక్షల నగదు, నగలు సీజ్
Comments
Please login to add a commentAdd a comment