హుబ్లీ: కలబుర్గి కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంక్ నుంచి లక్షలాది రూపాయలను డ్రా చేసుకున్న 5 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం ద్వారా ఆదిలోనే అక్రమాలకు బ్రేక్‌లు వేశారు. కమిషనర్‌తో పాటు చెక్‌బుక్‌పై సంతకాలు ఫోర్జరీ చేసి మూడు చెక్‌ల ద్వారా మొత్తం రూ.1 కోటి 30 లక్షలను డ్రా చేయడానికి 5 మంది నిందితులు ప్రయత్నించారు. మొదటి చెక్ రూ.35,56,640 నగదును నకిలీ సంతకాలతో డ్రా చేసుకున్నారు. అంతేగాక మరో రెండు చెక్‌లను ఇచ్చి డ్రా చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో బ్యాంక్ సిబ్బందికి అనుమానం కలగడంతో తక్షణమే కలబుర్గి పాలికె కమిషనర్ దృష్టికి విషయాన్ని తెచ్చారు. తక్షణమే అప్రమత్తమైన కమిషనర్ బ్రహ్మపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కార్యాచరణ జరిపిన పోలీసులు ముర్జాబేగ్, నాసీర్ అహ్మద్, మహమ్మద్ రెహమాన్ తదితరులతో పాటు మొత్తం 5 మందిని అరెస్ట్ చేశారు. కాగా వీరి నుంచి రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment