రేపు కన్నడ సమ్మేళనం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 18న జాతీయ స్థాయి కన్నడ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బెళకు సాహిత్య ట్రస్ట్ అధ్యక్షుడు అణ్ణప్ప మేటిగౌడ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేిసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జరిగే కార్యక్రమాన్ని అమరయ్య స్వామి ప్రారంభిస్తారన్నారు. కార్యక్ర మంలో శాసన సభ్యులు, కవులు, సాహితీవేత్తలు పాల్గొంటారన్నారు. వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి అవార్డులతో పాటు సన్మానం చేస్తామన్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి బళ్లారి: తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. గదగ్ జిల్లా గజేంద్రగడకు చెందిన ఖుషి(15) అనే విద్యార్థిని ఇంట్లో రగ్గు(దుప్పటి)తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు బాలురు గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏబీసీడీ వర్గీకరణకు డిమాండ్
రాయచూరు రూరల్: ఏబీసీడీ వర్గీకరణ చేసేంత వరకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని రద్దు చేయాలని కర్ణాటక మాల మహాసభ అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేిసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేసే వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు నెలల పాటు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వాయిదా వేశారని గుర్తు చేశారు. కర్ణాటకలో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం నియమించిన నాగమోహన్ దాస్ ఏకసభ్య సమితిని రద్దు చేయాలన్నారు. ఆది ద్రావిడ, కర్ణాటక, ఆంధ్రపదేశ్ ఇతర వర్గాల ప్రతి నిధులను సభ్యులుగా చేర్చుకొని వర్గీకరణ చేయాలన్నారు.
బనశంకరీదేవి సన్నిధిలో గిరిజా కల్యాణం
బనశంకరి: బనశంకరీదేవి జాతర మహోత్సవాల సందర్భంగా గిరిజాకల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ బనశంకరీదేవి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టి పూలతో అలంకరించారు. అనంతరం అర్చకుల బృందం గిరిజా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. సాయంత్రం ఊరేగింపు చేపట్టారు. ఆలయ ఈఓ ఎన్. కృష్ణప్ప పాల్గొన్నారు.
సిద్దరామ సాహిత్య
పురస్కారం ప్రదానం
హొసపేటె: బెంగళూరు ప్యాలెస్ మైదానంలో జరిగిన సిద్దరామ జయంతిలో కన్నడ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.పరశివమూర్తిని సిద్దరామ సాహిత్య పురస్కారంతో సత్కరించారు. పరిశోధన రంగంలో ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఈ అవార్డును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశోధకులు, రచయితలకు సమాజం నుంచి సముచిత గౌరవం లభించాలన్నారు. అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. మరింత కష్టపడి పని చేసేలా చైతన్యవంతులు అవుతారన్నారు. కార్యక్రమంలో సిద్దగంగా మఠం సిద్దలింగ స్వామి, మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ అశ్వత్థనారాయణ, సీటీ రవి, జేసీ మధుస్వామి, కన్నడ సినీ నటుడు డాలీ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment