పర్యాటకుని చొరవతో ప్రాణభిక్ష
● నదిలో పడిన యువకుడిని రక్షించిన వైనం
హొసపేటె: నదిలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతవుతుండగా ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పర్యాటకుడు చూసి నదిలోకి దిగి యువకుడిని కాపాడాడు. కొప్పళ తాలూకా మునిరాబాద్‌కు చెందిన యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. నదిలో గల్లంతైన యువకుడిని ఇజ్రాయెల్ టూరిస్ట్ రక్షించి ప్రాణాలు కాపాడాడు. గంగావతి తాలూకా సణాపుర గ్రామంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అబ్జర్వేటరీ(ఐబీ) సమీపంలో తుంగభద్ర నదిలో యువకుడు తన స్నేహితులతో కలిసి స్నానానికి వచ్చాడు. నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుండగా కాలుజారి నదిలో పడిపోయాడు. హంపీ, ఆనెగుందికి విహారయాత్రకు వచ్చిన ఇజ్రాయెల్‌కు చెందిన అబ్రహం ప్రైడ్‌మాన్ అనే విదేశీయుడు ఆ వైపు వెళుతుండగా యువకుడు నదిలో మునిగి పోవడం కనిపించింది. వెంటనే రక్షించేందుకు నదిలోకి దూకాడు. నదిలో తెప్పపై పని చేస్తున్న మురళి సహాయంతో ఇజ్రాయెల్ పర్యాటకుడు నీటిలో నుంచి యువకుడిని ప్రాణాలతో రక్షించాడు.
Comments
Please login to add a commentAdd a comment