కాలువ గట్లపై మట్టి హాంఫట్
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) గట్లపై మట్టి మాఫియా నెలల తరబడి అక్రమంగా మైనింగ్ చేస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఠాణాలు, రెవెన్యూ కార్యాలయాల ముందే మట్టితో లారీలు, టిప్పర్లు సంచరిస్తున్నా అధికార యంత్రాంగం మిన్నకుంటోంది. నిఘా వహించాల్సిన వ్యవస్థ నిష్క్రియంగా మారింది. అడ్డుకుంటే ఏ నాయకుడి నుంచి ఫోన్ వస్తుందో? అనే భయం వెంటాడుతోంది. మట్టి మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ప్రశ్నించకుండా వదిలేస్తున్నారు. స్థానిక నాయకులు మట్టి అక్రమ దందాలో దోచుకో, పంచుకో, తినుకో అన్న చందంగా తయారైంది. గత రెండేళ్ల నుంచి రూ.10 కోట్ల మేరకు ఉన్న ఉన్నత స్థాయి అధికారులు పరిగణించ కుండా, సమీక్షించకుండా అక్రమ తవ్వకాలపై సామాజిక మీడియాలో వచ్చినా ఫలితం లేదు. స్థానికుల అందోళన, లారీల అడ్డగింతలను ప్రభుత్వ పెద్దలు తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.
అక్రమంగా రాళ్ల తరలింపు
దేవదుర్గ తాలూకా అరికెర ప్రాంతంలోని చింతలకుంట, పిల్లిగుండ ప్రాంతాల్లో నారాయణపుర కుడి కాలువ గట్ల మీద ఉన్న మట్టి, బండరాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. 40 కి.మీ. పొడవున ప్రధాన కాలువ వద్ద ఈ కృత్యాలకు పాల్పడుతున్నారు. ఆరు టైర్ల టిప్పర్లలో పట్టే 12 ఘనపు మీటర్ల మట్టిని వినియోగదారులకు దూరాన్ని బట్టి రవాణా చార్జీలు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. మాజీ శాసన సభ్యుడు శివనగౌడ నాయక్ స్వగ్రామం అరికెర, పిల్లిగుండ, శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ స్వగ్రామం చింతలకుంట వద్ద అక్రమంగా మట్టిని తరలిస్తున్నా కృష్ణా భాగ్య జల నిగమ మండలి(కేబీజేఎన్‌ఎల్) అధికారులు నోరు మెదపడం లేదు. మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న లింగస్గూరు అమ్మాపూర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కాంట్రాక్టర్ శ్రీనివాస్‌పై మొక్కుబడిగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కేబీజేఎన్‌ఎల్ ఇంజినీర్లు బసనగౌడ, చంద్రశేఖర్‌లకు కాంట్రాక్టర్లు మామూళ్లు అందిస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.
హద్దులు చెరిపేస్తున్న మాఫియా
పట్టించుకోని ఇంజినీర్లు, పాలకులు
Comments
Please login to add a commentAdd a comment