గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం
కోలారు:76వ గణతంత్ర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు డిప్యూటీ కలెక్టర్ మంగళ సూచించారు. గణతంత్ర దిన వేడుకల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో గురువారం నిర్వహించిన పూర్వ సిద్దతా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎలాంటి లోపదోషాలు కనిపించకుండా వేడుకలు ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి భైరతి సురేష్ విశ్వేశ్వరయ్య స్టేడియంలో ధ్వజారోహణ చేస్తారని తెలిపారు. పాఠశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్, పోలీసులతో పథ సంచలనం నిర్వహించడానికి క్రీడా మైదానంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఆకర్షణీయ మైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ ప్రవీణ్, పి బాగేవాడి, వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.
రైతు సంఘం
నూతన కార్యవర్గం ఎంపిక
హొసపేటె: కర్ణాటక ప్రదేశ్ కృషిక్ సమాజ్ జిల్లా కమిటీకి నూతన పదాధికారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శరణప్ప ముదగల్ తెలిపారు. 2025–26 నుంచి 2029–30 వరకు ఐదేళ్ల కాలానికి జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, రాష్ట్ర ప్రతినిధి పదవులకు ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఒక్కో స్థానానికి ఒక్కరే నామినేషన్ వేయగా, కొత్త ఆఫీస్ బేరర్లుగా రాగి మసలవాడకు చెందిన కే.రేవణసిద్దప్ప(అధ్యక్షుడు), హొసపేటెకు చెందిన బీ.శ్రీనివాసులు(ఉపాధ్యక్షుడు), ఉత్తంగిలో ఎన్‌ఎస్ బెట్టప్ప(ప్రధాన కార్యదర్శి), మల్లనాయకనహళ్లిలోని దొడ్డమని నగేష్(కోశాధికారి,) కక్కుప్పి ఎం.బసవరాజు(రాష్ట్ర ప్రతినిధి) ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిపారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సభ్యులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment