ఐదు గ్యారెంటీలు పేదలకు వరం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీలు అమలు చేయడంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతోందని గ్యారెంటీల అమలు జిల్లా ప్రాధికార అధ్యక్షుడు చిదానందప్ప పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండును పరిశీలించి, అక్కడ స్వచ్ఛతా లోపం, తాగునీటి సమస్యతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన అనంతరం సంబంధిత అధికారులతో చర్చించారు. కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండులో తిష్టవేసిన సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో తగిన చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం మహిళా ప్రయాణికులతో చర్చించారు. శక్తియోజనతో ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ఒక ఊరు నుంచి మరొక ఊరుకు వెళ్లేందుకు, విద్యార్థినులకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మహిళా శక్తియోజనతో లబ్ధి పొందుతోందన్నారు. నాగభూషణగౌడ, కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు పాల్గొన్నారు.
శక్తి యోజనతో మహిళలకు
ఎంతో ఉపయోగం
అమలు ప్రాధికార జిల్లా అధ్యక్షుడు చిదానందప్ప
Comments
Please login to add a commentAdd a comment