సేవా భద్రత కల్పించాలని వినతి
హొసపేటె: వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు అన్ని విధాలుగా సేవా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంట్రాక్టు ఉద్యోగులు జిల్లాధికారి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సంఘం నేతలు జంబయ్యనాయక్, తాయప్ప మాట్లాడుతూ కుక్‌లు, కిచెన్ అసిస్టెంట్లు, క్లీనర్లు, గార్డు, డీ గ్రూప్ అటెండెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా గత 15–20 ఏళ్లుగా బోర్డింగ్ స్కూల్, కాలేజీల్లో మైనార్టీ సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ తరగతుల సంక్షేమ శాఖ, కర్ణాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థల్లో తక్కువ వేతనంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేషన్, ఔట్‌సోర్సింగ్ టీచర్లు, రోజు వారీ వేతనాల కార్మికులు ఎలాంటి భద్రత లేకుండా పని చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లు, వార్డెన్లు, తాలూకా, జిల్లా స్థాయి అధికారులు ఔట్‌సోర్సింగ్ కార్మికులను దోపిడీ చేస్తున్నారన్నారు. కొన్ని సమస్యలపై చర్చించేందుకు సమావేశ తేదీని ఖరారు చేయాలని కోరుతూ జిల్లాధికారి కార్యాలయంలో అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment