ప్రత్యేక ప్యాకేజీ కోసం రైతుల ఆందోళన
రాయచూరు రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కంది పంటకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రైతులు జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన జరిపారు. కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి, కొప్పళ తదితర జిల్లాల్లో రైతులు పండించిన కంది పంటకు మార్కెట్‌లో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. కళ్యాణ కర్ణాటకలో 10 లక్షల టన్నుల కందిపప్పును ఖరీదు చేయాలని మార్కెటింగ్ శాఖాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కలబుర్గి, రాయచూరు ఏపీఎంసీలో నెలరోజుల్లో క్వింటాల్‌కు రూ.వెయ్యి తగ్గింది. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8,169 ధరను ప్రకటించారు. జనవరి 1 నుంచి 18 వరకు 28,967 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గతంలో 75,185 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment