పుట్‌పాత్ దుకాణాలను తొలగించొద్దు
రాయచూరు రూరల్: జాతీయ రహదారిలోని ఫుట్‌పాత్ దుకాణాలను తొలగించవద్దని వీధి వ్యాపారుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు గంగాధర్ మాట్లాడారు. హైదరాబాద్ జాతీయ రహదారిలో పుట్‌పాత్‌లపై వెలసిన దుకాణాల తొలగింపునకు సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారన్నారు. దీంతో ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను తీర్చడానికి ఇబ్బందిగా మారందన్నారు. వీధి వ్యాపారులకు పరిహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment