హుబ్లీ: ముడా కేసులో సీఎం సిద్దరామయ్య మొండివైఖరి ప్రదర్శిస్తున్నారని, సున్నిత మనస్కులైతే ఇప్పటికే రాజీనామా చేసి దర్యాప్తులో భాగంగా విచారణ ఎదుర్కొనేవారని విధానసభ విపక్ష ఉపనేత అరవింద బెల్లద ఆరోపించారు. ఇక్కడి మీడియాతో ఆయన మాట్లాడుతూ సదరు కేసుల్లో సిద్దరామయ్య కుటుంబం పాలు పంచుకుందని మొత్తం ప్రపంచానికే తెలుసన్నారు. గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినప్పుడు అరెస్ట్ అయ్యే వరకు వేచి ఉండరాదన్నారు. తక్షణమే రాజీనామా చేసి గదెంద దిగి పోవాలన్నదే ప్రజల కోరిక అన్నారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా దర్యాప్తు జరగాలంటే సిద్దు సీఎం పదవిలో ఉండరాదన్న డిమాండ్ వినిపిస్తుందని, అయినా సిద్దు మొండి వైఖరితో నడుచుకుంటున్నారన్నారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందని, దానిపై నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment