హుబ్లీ: నకిలీ గాంధీల నేతృత్వంలో బెళగావి సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి మండిపడ్డారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా వాయిదా వేశారన్నారు. తిరిగి అవే డబ్బు ఖర్చు చేసి కార్యక్రమాన్ని చేపట్టారు. డబ్బులు లేక ఎన్నో ప్రజోపయోగ పననులు నిలిచి పోయాయన్నారు. ఈ విషయాన్ని మీడియా కూడా తేటతెల్లం చేసిందన్నారు. ఇలాంటి స్థితిలో డబ్బులు వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విసర్జనకు మహాత్మాగాంధీ సూచించారన్నారు. ఆయన చెప్పినట్లు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీనే అస్థిత్వంలో ఉండేది కాదన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని అభివర్ణించారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ తీరు సమంజసంగా లేదన్నారు. దీంతో రాష్ట్రంలో పాలనా యంత్రాంగం స్తంభించిపోయిందన్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలు కొందరు బీజేపీపై మాట్లాడుతున్నారు. అయితే రాష్ట్రంలో వారే అధికారంలో ఉన్నారు. వారి పరస్పర దాడులు పాలనపై ప్రభావం చూపుతున్నాయన్నారు. అది వారింటి పని కాదు. వారు బీజేపీపై ఎందుకు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినందుకే మేం కూడా స్పందించాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సమిత్వ యోజనపై మంత్రి సంతోష్‌లాడ్ మాట్లాడటంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ యోజనను అమల్లోకి తెచ్చిన ప్రధాని మోదీ ఫోటో పెట్టలేదు. ఆయన పేరు కూడా చెప్పడం లేదని కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రహ్లాద్‌జోషి తీవ్రంగా ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment