ఎయిమ్స్‌పై ప్రధానితో చర్చిస్తా
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా చూస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం మాన్విలో తనను కలిసిన ఆందోళన సమితి అధ్యక్షుడు బసవరాజ కళస నుంచి వినతిపత్రం స్వీకరించి ఆందోళనకు మద్దతు పలికి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించేలా చూస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గళం విప్పాలన్నారు. మంత్రాలయ మఠాధిపతి చేసిన సూచన మేరకు శాయశక్తులా ప్రయత్నిమని తెలిపారు.
డాక్టరేట్ పట్టా
బళ్లారిఅర్బన్: గంగావతిలోని సంకల్ప డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.అమిత్‌కుమార్ రెడ్డికి బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) పీహెచ్‌డీని ప్రకటించింది. ఈయన వాణిజ్య శాస్త్ర అధ్యయన విభాగం సహాయక ప్రొఫెసర్ డాక్టర్ బీ.మేఘరాజ్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక అంశం గురించి పరిశోధించి రచించిన మహావ్యాసానికి వర్సిటీ ఈ పట్టా అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment