బనశంకరి: సంచలనం సృష్టించిన మంగళూరు కోటికార్‌బ్యాంక్ దోపిడీ కేసులో ముగ్గురు దోపిడీదారులను సోమవారం అరెస్ట్‌చేసి నగదు స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. ఉళ్లాల కేసీ.రోడ్డులోఉన్న కోటికార్ బ్యాంకులో ఈ నెల 17వ తేదీన దొంగలు చొరబడి రూ. 12 కోట్లకు పైగా డబ్బు, బంగారు నగలను దోచుకున్నారు. పోలీస్‌బృందాలు తీవ్రంగా గాలించి తమిళనాడు తిరునల్వేలిలో అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు, కారును సీజ్ చేసుకున్నామని తెలిపారు.
మెట్రో పట్టాలపై ఆత్మహత్యాయత్నం
యశవంతపుర: నగరంలో మెట్రో రైలు పట్టాలపై పడి ఆత్మహత్య యత్నించిన ఘటన జాలహళ్లిలో చోటుచేసుకోంది. వివరాలు.. రిటైర్డు వాయుసేన ఉద్యోగి బిహార్‌కు చెందిన అనిల్‌కుమార్ పాండే(49) సోమవారం ఉదయం 10:25 గంటలకు సెంట్రల్ సిల్క్‌బోర్డు నుంచి మాదావర మార్గంలో తిరుగుతున్న మెట్రో రైలును ఎక్కాడు. జాలహళ్లి స్టేషన్‌కు చేరుకోగానే చనిపోవాలని పట్టాలపైకి దూకాడు. సిబ్బంది తక్షణం అత్యవసర బటన్ నొక్కడంతో కరెంటు నిలిచిపోయింది. దీంతో అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మెట్రో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో అర్ధగంట పాటు రైళ్లు ఆలస్యమయ్యాయి.
కారు– లారీ ఢీ, ముగ్గురి మృతి
దొడ్డబళ్లాపురం: లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడే మరణించిన సంఘటన కలబుర్గి జిల్లా చించోళి తాలూకా కుంచావరం ఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. 149వ స్టేట్ హైవేపై మధ్యాహ్నం 1 గంట సమయంలో లారీ, కారు ముఖాముఖి ఢీకొన్నాయి. తెలంగాణలోని తోరమామిడి నుండి తాండూరు వైపు వెళ్తున్న కారును, మొగదంపుర వైపు నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. బీదర్‌కు చెందిన అవినాశ్ (24), అభిషేక్ (26), సంజు(40 మృతులు. వినోద్, నవీన్, అరుణ భోజప్ప అనే ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని బీదర్‌లోని బ్రిమ్స్ అస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment