పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

Published Sun, Oct 20 2024 12:08 AM | Last Updated on Sun, Oct 20 2024 12:08 AM

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

● రేపటి నుంచి కేంద్రాల ప్రారంభం ● జిల్లా సహకార అధికారి గంగాధర్‌

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా సహకార అధికారి జి.గంగాధర్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సన్నాహక సమావేశంలో పీఏసీఎస్‌ బాధ్యులకు ఆయన సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించడమే కాక గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, తూకం యంత్రాలు సమకూర్చుకోవాలని తెలిపారు. రైతుల కోసం టెంట్‌, తాగునీరు, కుర్చీలు ఏర్పాటుచేయాలని చెప్పారు. అకాల వర్షాల దృష్ట్యా టార్పాలిన్ను సిద్ధం చేసుకోవాలని, సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తున్న విషయమై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. సన్నరకం ధాన్యం నాణ్యత వివరాలను ఏఈఓలు ధ్రువీకరించనుండగా, ఆ పత్రంతో పాటు ధాన్యం రకం, పరిమాణం, నాణ్యతను పరిశీలించాక కాంటా వేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేశాక ఆన్‌లైన్‌ లో నమోదు చేస్తే రైతులకు 48 గంటల్లో నగదు జమ అవుతుందని సహకార అధికారి గంగాధర్‌ తెలిపారు. ఈ సమావేశంలో సహకార శాఖ ఉద్యోగులు ఎండీ.ఆసీఫ్‌ అన్వర్‌, టి.వెంకటేశ్వర్లు, రాంచందర్‌, పీఏసీఎస్‌ల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మద్దతు ధరే లక్ష్యం

అన్నదాతలకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌, జిల్లా కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. ఖమ్మం డీసీఎంఎస్‌ కార్యాలయంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీసీఎంఎస్‌ ద్వారా ఎనిమిది మండలాల్లో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం గ్రేడ్‌ ‘ఏ’రకం ధాన్యం క్వింటాకు రూ. 2,320, సాధారణ రకానికి రూ.2,300గా ధర నిర్ణయించిందన్నారు. ఈసమావేశంలో డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ కె.సందీప్‌, క్వాలిటీ కంట్రోల్‌ మేనేజర్‌ పి.రాంచందర్‌రావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement