అత్యంత ప్రమాదంలో ప్రజాస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

అత్యంత ప్రమాదంలో ప్రజాస్వామ్యం

Published Sun, Oct 20 2024 12:08 AM | Last Updated on Sun, Oct 20 2024 12:08 AM

అత్యంత ప్రమాదంలో ప్రజాస్వామ్యం

● ఆలోచించే వారిపై నిర్బంధం ప్రయోగిస్తున్న రాజ్యం ● ప్రొఫెసర్‌ సాయిబాబా సంస్మరణ సభలో వక్తలు

ఖమ్మంవన్‌టౌన్‌: ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై రాజ్యం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటీవల మృతి చెందిన ప్రొఫెసర్‌ జీఎన్‌.సాయిబాబా సంస్మరణ సభ ఖమ్మంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ప్రత్యామ్నాయ పౌర సమూహం(సీఏఏ) కన్వీనర్‌ స్పర్శ భాస్కర్‌ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సాయిబాబా చిత్రపటం వద్ద నివాళులర్పించగా సీసీఏ బాధ్యుడు ఐవీ.రమణారావు రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీపీఎం నాయకుడు ఎర్రా శ్రీకాంత్‌, ప్రముఖ వైద్యుడు ఎంఎఫ్‌ గోపీనాఽథ్‌తో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఆవునూరి మధు, యలమంచిలి రవీంద్రనాధ్‌ద్‌, పోపూరి రవిమారుత్‌, బండారు రమేష్‌ మాట్లాడారు.

కుట్రపూరిత చట్టాలు.. హింస

తొంభై శాతం దివ్యాంగుడైన సాయిబాబుపై రాజ్యం కుట్రపూరితమైన చట్టాలను ప్రయోగించి పదేళ్ల పాటు తీవ్రంగా హింసించిందని వక్తలు పేర్కొన్నారు. హృద్రోగంతో బాధపడుతున్న ఆయనకు సరైన చికిత్స అందించకపోగా, తల్లి చివరిచూపునకు సైతం అనుమతించలేదని తెలిపారు. తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి తరచూ పెరోల్‌కు అనుమతించే ప్రభుత్వం.. ఆదివాసీల హక్కులపై నినదించిన ప్రొఫెసర్‌ సాయిబాబా విషయంలో అమానవీయంగా ప్రవర్తించిందని చెప్పా రు. సాయిబాబాది రాజ్యం చేసిన హత్యేనని తెలి పారు. ప్రశ్నించే వారిపై ఈ ప్రభుత్వం కేసులు పెట్టి అణచివేస్తున్న నేపథ్యాన అంతా ఐక్యంగా ప్రజాపోరాటాలు నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ సభలో వినుకొండ మనోహర్‌రాజు, పేర్ల మధు, దేవిరెడ్డి విజయ్‌, ఆవుల అశోక్‌, మేకల సుగుణారావు, బాలబోయిన విజయ్‌, బచ్చలికూర ఝాన్సీ, మంగతాయి, చిర్రా రవి, కొమ్ము రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement