పనితీరు మార్చుకోండి..
వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం ఉదయం, రాత్రి చలి తీవ్రత ఉంటుంది. మిగతా సమయంలోనూ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.
ఇంజనీర్లపై ఎస్‌ఈ ఆగ్రహం
ఖమ్మంఅర్బన్: సాగర్ కాల్వల పరిరక్షణ కోసం ఇంజనీర్లు నిరంతరం పరిశీలించాలని జలవనరులశాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈవిషయంలో నిర్లక్ష్యాన్ని విడనాడి పనితీరు మార్చుకోవాలని సూచించారు. సాగర్ ప్రధాన కాల్వను గురువారం ఆయన ఖమ్మం నుంచి ఏన్కూరు వరకు పరిశీలించారు. పలుచోట్ల కాల్వను ఆనుకుని పంటలు సాగు చేస్తుండడాన్ని గుర్తించారు. ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వ వెంటే పంటల సాగుతో కట్టల మట్టి కరిగిపోతోందని తెలిపారు. ఇకనైనా దీన్ని అరికట్టడంతో పాటు పొలాలకు సాగు నీరందేలా పర్యవేక్షించాలని సూచించారు. తనిఖీల్లో ఈఈ అనన్య, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
28న ఆర్టీసీ కార్గోలో
పాత పార్సిళ్ల వేలం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఆర్టీసీ డిపో పరిధిలోని కార్గో సెంటర్‌లో వినియోగదారులు తీసుకెళ్లని పాత పార్సిళ్లను ఈనెల 28న వేలం వేయనున్నట్లు లాజిస్టిక్ మేనేజర్ రామారావు తెలిపారు. ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో 28న సాయంత్రం 4 గంటలకు వేలం మొదలవుతుందని వెల్లడించారు. పార్సిళ్ల క్లియరెన్స్ కోసం ఈ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment