చేపల మార్కెటింగ్‌పై దృష్టి సారించండి
● తద్వారా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి ● ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మంవ్యవసాయం: మత్స్య సంపదతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నందున మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తే మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేపల వినియోగం పెరుగుతున్న నేపధ్యాన పెంపకం, మార్కెటింగ్‌పై దృష్టి సారించాలన్నారు. పౌష్టికాహారంలో కీలకమైన చేపలపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు పంపిణీ చేస్తున్నందున మత్స్యకారులు వాటిని కాపాడుకుంటే మంచి లాభాలు వస్తాయని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జ్ మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు. కాగా, ఆసరా పింఛన్లు, బీమా సౌకర్యం కల్పించడమే కాక లైఫ్ జాకెట్లు సమకూర్చాలని, గంగపుత్ర సంఘం భవనానికి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని సంఘం ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కన్నం ప్రసన్నకృష్ణ, దేశబోయిన మంగారావుతో పాటు పెద్దపల్లి సుధాకర్, వంగాల వెంకట్, చేతి కృష్ణ, చింతల మల్లేశం, దేశబోయిన తిరుపతయ్య, మైస శంకర్, సురేష్, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ
ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతపై సిబ్బందికి సూచనలు చేయడంతో పాటు ఆవరణను శుభ్రం చేయించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్.స్వామి, డీటీ అన్సారీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment