రైల్వేలైన్‌కు భూసేకరణ పూర్తి | - | Sakshi
Sakshi News home page

రైల్వేలైన్‌కు భూసేకరణ పూర్తి

Published Fri, Nov 22 2024 12:24 AM | Last Updated on Fri, Nov 22 2024 12:24 AM

రైల్వేలైన్‌కు భూసేకరణ పూర్తి

రైల్వేలైన్‌కు భూసేకరణ పూర్తి

మధిర: కాజీపేట–విజయవాడ రైల్వే మార్గంలో మూడోలైన్‌ నిర్మాణం చేపడుతుండగా మధిర పట్ట ణంలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే మూడో లైన్‌ ఎర్రుపాలెంలో పూర్తయినా మధిర పట్టణంలో మాత్రం స్థల సేకరణ విషయమై అభ్యంతరాలతో ముందుకు సాగడం లేదు. రైల్వే అధికారులు, ఇళ్ల యజమానుల నడుమ వివాదంతో ఈ పరి స్థితి నెలకొనగా పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో రెవెన్యూ అధికారులు మరోమారు సర్వే చేసి అభ్యంతరాలను పరిష్కరిస్తూ కొలతలను సరిచేశా రు. అంతేకాక గృహ యజమానులు కోల్పోయిన స్థలానికి పరిహారం అందజేయగా వారు స్థలాలను అప్పగించారు. దీంతో మధిరలో కూడా రైల్వే మూడో లైన్‌ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, రైల్వేశాఖల ఉద్యోగులు మురళి, ఉషారాణి, కె.అశోక్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement