పెద్దాస్పత్రిలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక క్లినిక్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్‌ను సోమవారం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ప్రారంభించారు. అనంతరం వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లకు ప్రతీ గురువారం ఇక్కడ డెర్మటాలజీ, సైక్రియాట్రిక్, జనరల్ మెడిసిన్ వైద్యులు సేవలందిస్తారని తెలిపారు. అలాగే, ఇద్దరు కౌన్సిలర్లను కూడా కేటాయించినట్లు చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, హెచ్‌ఓడీ సర్జన్ బి.కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment