దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి
ఖమ్మంవన్‌టౌన్: పట్టుదలతో ముందుకు సాగుతూ దివ్యాంగులు సాధారణ వ్యక్తులతో సమానంగా అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం టీఎన్జీ వోస్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ కష్టం వచ్చినా కలెక్టర్‌గా కాకుండా కుటుంబ సభ్యుడిగా అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. అర్హత మేరకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని చెప్పారు. అనంతరం క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖాఽధికారి కీసర రాంగోపాల్‌రెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏసీబీ పోస్టర్లు ఆవిష్కరణ
ఖమ్మం సహకారనగర్: అవినీతి నిరోధక శాఖ రూపొందించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నంబర్లు 91543 88989, 040–23251555, లేదావాట్సాప్ 94404 46106 నంబర్‌తో పాటు ఖమ్మం రేంజ్ అధికారులను 91543 88981, 0874–2228663 నంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్, ఇన్‌స్పెక్టర్ ఎన్.శేఖర్ పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment