‘పాలేరు’ ఇంజనీరింగ్ కాలేజీకి సొంత భవనాలు
రూ.108 కోట్ల నిధుల మంజూరు
ఖమ్మంరూరల్: పాలేరు నియోజకవర్గంలో జేఎన్‌టీయూ ఆధ్వర్యాన ఏర్పాటైన ఇంజనీరింగ్ కళాశాలకు సొంత భవనాలు సమకూరనున్నా యి. ఈమేరకు ఇక్క డ నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనల మేరకు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో భవన నిర్మాణాలకు రూ.108.60 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాదే కళాశాల మంజూరు కాగా ప్రస్తుతం అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యాన సొంత భవనాలకు నిధులు మంజూరు చేయించడంపై విద్యార్థులు, పాలేరు నియోజకవర్గ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment