మొక్కజొన్నకు కత్తెర ‘కాటు’
ఇల్లెందురూరల్: యాసంగిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు అత్యధికంగా మొక్కజొన్న పంట సాగు చేస్తారు. ఈమేరకు దుక్కి సిద్ధం చేసి విత్తనాలు కూడా విత్తారు. అవి మొలకలుగా ఎదుగుతుండగా వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ కత్తెర పురుగు మొదలైంది. కత్తెర పురుగులు ఆకులను తినేయడంతోపాటు మొక్క కాండాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఈ పరిణామం మొక్క ఎదుగుదలపై ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు. అంతేకాక ఆకులు మాడిపోతుండడం గమనార్హం. కాగా, పురుగు ఉధృతి ప్రారంభదశలోనే ఉన్నందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఇల్లెందు వ్యవసాయశాఖ అధికారి సతీష్ సూచించారు. మార్కెట్‌లో ఈ పురుగు నివారణ మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కత్తెర పురుగు సూర్యరశ్మి ఉన్నంతసేపు ఆకు కాండంలోనే తలదాచుకుని, రాత్రివేళ బయటకు వచ్చి ఆకులను తింటుందని పేర్కొన్నారు. ఈనేపథ్యాన వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఉదయం లేదా సాయంత్రం క్రిమిసంహారక మందులు ప్రయోగిస్తే ఫలితముంటుందని తెలిపారు.
మొలక దశలోనే ఆశిస్తున్న పురుగు
Comments
Please login to add a commentAdd a comment