నేలకొండపల్లి: సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమ్మెతో పాఠశాలల్లో బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. అంతేకాక మండల విద్యా వనరుల కేంద్రాలు తెరిచేవారు కరువయ్యారు. ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో దాదాపు 632 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియయ్యాన్ని మండల లెవల్ స్టాక్ పాయింట్ నుంచి తీసుకొస్తారు. ఈక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేసే సీఆర్‌పీ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వీరంతా సమ్మెలో ఉండడంతో పాఠశాలలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని మూడు మండలాల్లో మాత్రమే ఎంఈఓలకు వేలిముద్ర అవకాశం ఉండగా ఆ మూడు మండలాల్లోని పాఠశాలలకు బియ్యం చేరింది. మరోపక్క సీఆర్‌పీల సమ్మెతో మండల విద్యావనరుల కేంద్రాలు తెరిచే వారు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీరోజు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వివరాలను డీఈఓ కార్యాలయానికి చేరవేయడంలోనూ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అలాగే, కేజీబీవీల్లో బోధన కుంటుపడుతోందని ఇప్పటికే విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.
సీఆర్‌పీల సమ్మె ప్రభావమే కారణం
Comments
Please login to add a commentAdd a comment