● పోటీకి వెళ్తే బహుమతే...
మధిర: మధిర మండలం మహదేవపురం జెడ్పీహెచ్‌ఎస్ ఎస్సెస్సీ విద్యార్థిని ఒరుగు సంధ్యారాణి గణిత టాలెంట్ టెస్టుల్లో ప్రతిభ చాటుతోంది. రాయపట్నం గ్రామానికి చెందిన ఆమె గణిత ఉపాధ్యాయుడు పోలే సుధాకర్ సహకారంతో పోటీలకు హాజరవుతోంది. ఇటీవల తెలంగాణ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల, జిల్లాస్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. అలాగే, చెకుముకి టాలెంట్ టెస్ట్‌లోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించి మండల స్థాయిలో మొదటి బహుమతి, జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి గణిత పోటీలల్లో సంధ్యారాణిపాల్గొననుంది.
Comments
Please login to add a commentAdd a comment