వృద్ధురాలిపై దాడి చేసి..
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో శుక్రవారం అర్థరాత్రి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసిన దుండుగులు ఆమె మెడలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం... పిండిప్రోలుకు చెందిన ఆరెంపుల వెంకటమ్మ భర్త గురవయ్య మృతిచెందగా కుమారులిద్దరు ఖమ్మంలో ఉంటున్నారు. ప్రతీ శనివారం జరిగే వారాంతపు సంతలో పశువులు, మేకల తాళ్లు అమ్ముకుంటూ ఆమె జీవిస్తోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రించగా గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఆమె ముఖంపై రాయితో దాడి చేసి మెడలో ఉన్న తులంన్నర బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment