రూ.3.80 లక్షల నగదు స్వాధీనం
సత్తుపల్లి: అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి 19 మందిని అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల జూదరులను సమీకరించి సత్తుపల్లి మండలం చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో పేకాట శిబిరం ఏర్పాటుచేశారనే సమాచారంతో శనివారం రాత్రి సత్తుపల్లి పట్టణ సీఐ టి.కిరణ్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులను చూసి కొందరు పారిపోగా 19 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.3.80 లక్షలు నగదు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
మేకపిల్లను కాపాడబోయి యువకుడు మృతి
తిరుమలాయపాలెం: బావిలో పడిన మేకపిల్లను కాపాడే యత్నంలో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని కొక్కిరేణిలో శనివారం ఆ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గద్దల ఉపేందర్ కుమారుడు నాగచైతన్య(17) మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. శనివారం మేకలు కాస్తుండగా మందలోని ఓ మేకపిల్ల ప్రమాదవశాత్తు బావిలో పడింది. దీంతో దాన్ని బయటకు తీసే క్రమాన నాగచైతన్య బావిలో జారి పడి మృతి చెందాడు. ఘటనపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఉపేందర్ – రేణుక దంపతులకు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు నాగచైతన్య మృతితో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment