ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లిలో ఇటీవల నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో 15 తీర్మానాలను ఆమోదించినట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొదించినట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, గ్రానైట్ పరిశ్రమల్లో సంక్షోభం, రైతుభరోసా తదితర అంశాలపై ఉద్యమాలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే, రుణమాఫీకి సంబంధించి ఈనెల 23న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఆదివారం ఖమ్మంతో అని మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, కళ్యాణ వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, మాదినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
● రఘునాథపాలెం: మండలంలోని కోటపాడులో అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు భూపతిరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని శనివారం పరామర్శించాక ఆయన మాట్లాడారు. సీపీఎం మండల కార్యదర్శి ఎస్.నవీన్‌రెడ్డి, నాయకులు బషీరుద్దీన్, తుడుం ప్రవీణ్, మెరుగు సత్యనారాయణ, ప్రతాపనేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment